వంశీని అదుపులోకి తీసుకున్న ఆత్కూరు పోలీసులు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆత్కూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు;

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆత్కూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరోజు కస్టడీలోకి వంశీని ప్రశ్నించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న వల్లభనేని వంశీ పై అనేక కేసులు వరసగా నమోదవుతున్నాయి. ఒక్కొక్క కేసు వంశీ మెడకు చుట్టుకుంటున్నాయి.
వరస కేసులు...
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు మైనింగ్, ఇసుక అక్రమ రవాణా కేసులు అనేకం వల్లభనేని వంశీపై కేసు నమోదయ్యాయి. వరసగా వంశీపై ఫిర్యాదులు వస్తుండటంతో ఒక్కొక్క కేసు నమోదు చేస్తున్న పోలీసులు ఫిర్యాదును పరిశీలించి పరిశీలిస్తున్నారు. వల్లభనేని వంశీపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఆత్కూరు పోలీసులు పటిష్ట భద్రత మధ్య వల్లభనేని వంశీని తమ కస్టడీలోకి తీసుకుని ఈరోజు ప్రశ్నించనున్నారు.