Nara Lokesh : రెడ్ బుక్ పేరు వింటే..గుండెపోట్లు.. జారిపడటం..అర్థమయిందా రాజా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు;

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ తాను ఎక్కడకు వెళుతున్నా రెడ్ బుక్ ను గురించి ప్రశ్నిస్తున్నారన్నారు. అయితే రెడ్ బుక్ పేరు చెప్పగానే కొందరికి గుండెపోటు వస్తుందని, మరికొందరు బాత్రూంలో జారిపడి చేతులువిరగ్గొట్టుంటున్నారని అన్నారు. అర్ధమయిందా రాజా అంటూ క్యాడర్ ను ఉత్సాహ పర్చారు.
ఎవరూ సందేహపడాల్సిన...
మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు రావడం, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్రూంలో పడి చేయి విరగడం వంటి ఘటనలను ప్రస్తావించకుండానే నేరుగా వారి పేర్లను ఎత్తకుండానే నారా లోకేశ్ సెటైర్లు వేశారు. అయితే చట్ట ప్రకారమే తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అందులో ఎవరూ సందేహపడాల్సిన అవసరం లేదని అన్నారు.