నేడు జగన్ ఎమ్మెల్యేలతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంో ఈ సమీక్ష జరగనుంది. ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పాల్గొననున్నారు.
గడప గడపకు ప్రభుత్వం....
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎవరు పాల్గొంటుందీ. ఎవరు దూరంగా ఉంటుందీ జగన్ ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్న జగన్ ఈ సమీక్షలో వాటిని బయటపెట్టనున్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేయాల్సిన బూత్ లెవెల్ కమిటీలపై కూడా జగన్ చర్చించనున్నారు.