Chandrababu : కుప్పం ప్రజలకు చంద్రబాబు వరాలు
కుప్పంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు;
కుప్పంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉన్నత విద్యకోసం బెంగళూరుకు వెళ్లకూడదని, కుప్పానికి రావాలని ఆయన అన్నారు. గుంతలు లేని రహదారులు నిర్మించే బాధ్యత తనది అని అన్నారు.కుప్పంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిని చేస్తామని తెలిపారు. కుప్పం నియోజకవర్గానికి కావాల్సిన అన్ని హంగులు తాను సమకూర్చుతానని చంద్రబాబు మాట ఇచ్చారు. ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నానని ప్రజలకు హామీ ఇచ్చారు.
మూడు నెలల్లో మళ్లీ వచ్చి...
అదే సయమంలో మరో మూడు నెలల్లో మళ్లీ ఒకసారి కుప్పం నియోజకవర్గానికి వస్తానని, ఇప్పుడు శంకుస్థాపనలు చేసిన కార్యక్రమాల అమలు తీరును తాను దగ్గరుండి పరిశీలిస్తానని చెప్పారు. తాను రాష్ట్రంలో ఏ పని మొదలు పెట్టాలన్నా దానిని తొలుత కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించడం అలవాటు అని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది తనకు అలవాటు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కుప్పంను ఒక డైనమిక్ సెంటర్ గా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App No