Chandrababu : నేడు రెండోరోజు కుప్పంలో చంద్రబాబు

నేడు కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది;

Update: 2025-01-07 03:13 GMT

నేడు కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నిన్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు నేడు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన నాయకుడు సెంటర్‌ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంస్థాపన చేయనున్నారు.

ప్రజల నుంచి...
అనంతరం ప్రజల నుంచి చంద్రబాబు వినతుల స్వీకరించనున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చూపుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించనున్నారు. చంద్రబాబు వద్దకు పెద్దయెత్తున ప్రజలు తరలి వస్తుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు రాత్రికి కూడా ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో చంద్రబాబు బసచేయనున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News