Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం అయినా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది;
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. మంగళవారం అయినా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అయితే వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రారంభం కానుండటం, అది పందొమ్మిది తేదీ వరకూ ఉండటంతో ముందుగానే శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తిరుమలలోని అన్ని వీధులు భక్తులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా గోవింద నామస్మరణలే వినిపిస్తున్నాయి. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని భక్తులను టీటీడీ కోరుతుంది. ఈ నెల 10 వ తేదీ నుంచి తిరుమలకు భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందుగానే శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. లడ్డూ తయారీ కేంద్రాల వద్ద, అన్న ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ ఈరోజు అధికంగా ఉందని అధికారులు తెలిపారు. ఇక పదో తేదీ వరకూ ఇదే రద్దీ కొనసాగుతుందని అంచనాలో అధికారులు ఉన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ