నేడు కడప జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప అమీన్ పీర్ దర్గాను జగన్ సందర్శించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప అమీన్ పీర్ దర్గాను జగన్ సందర్శించుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరికాసేపట్లో జగన్ కడపకు బయలుదేరి వెళతారు. కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేస్తారు.
వివాహ వేడుకకు...
అనంతరం కడప నగరంలో రాయచోటి రోడ్డులో మాధవి కన్వెన్షన్ లో జరిగే ఒక వివాహ వేడుకకు జగన్ హాజరవుతారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరిగి కడప నుంచి గన్నవరం బయలుదేరి వస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.