ఈ నెల 24న కొవ్వూరుకు జగన్
ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.;
ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హోం మంత్రి తానేటి వనిత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొవ్వూరు పట్టణంలో పర్యటించనున్నారు.
జగనన్న విద్యాదీవెన...
కొవ్వూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం జగనన్న విద్యా దీవెన పథకం కింద లబ్డిదారులకు బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. పెద్దయత్తున జనసమీకరణ చేయడానికి వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతానికి జగన్ వస్తుండటంతో వైసీపీ నేతలు