పిన్నెల్లి ప్రధాన అనుచరుడు అరెస్ట్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు;
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తురకా కిషోర్ అప్పటి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, బుద్దా వెంకన్న వాహనంపై దాడి చేసిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. స్థానికసంస్థల ఎన్నికలసందర్భంగా అక్కడకు వెళ్లిన వారి వాహనంపై ఇనుప రాడ్ తో దాడిచేశాడు.
పరారీలో...
అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తురకా కిషోర్ కేసుల భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన హైదరాబాద్ లో గత ఏడు నెలల నుంచి తలదాచుకుంటున్నట్లు సమాచారం అందడంతోపోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ తురకాకిషోర్ ను అదుపులోకి తీసుకుని మాచర్లకు తీసుకువచ్చారు. గతంలో జరిగిన ఘటనపై ఆయనపై కేసులు నమోదు కావడంతో తురకా కిషోర్ ను అరెస్ట్ చేశారు
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ