నేడు ప్రకాశం జిల్లాకు జగన్
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు;
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తికి 10.35 గంటలకు చేరుకుంటారు. చీమకుర్తి మెయిన్ రోడ్డులో బూచేపల్లి సుబ్బారెడ్డి కళ్యాణమండపం వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ల కాంస్య విగ్రహాలను ఆవిష్కరిస్తారు.
బహిరంగ సభలో....
అనంతరం చీమకుర్తిలోని బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి మధ్యాహ్నం 1.40 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు వెల్లడించాయి