ఫ్యాన్సీ నెంబర్లు ఇక కొనలేరు

ఖజానా నింపుకోవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని దారులు వెతుక్కుంటుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా అది వదలడం లేదు

Update: 2022-06-10 02:25 GMT

ఖజానా నింపుకోవడానికి ఏపీ ప్రభుత్వం అన్ని దారులు వెతుక్కుంటుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా అది వదలడం లేదు. తాజాగా వాహనాల ఫ్యాన్సీ రిజస్ట్రేషన్ నెంబర్ల ఫీజును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఒక ఫ్యాన్సీ నెంబరు కొనుగోలు చేయడానికి ఐదు వేల నుంచి రెండు లక్షల వరకూ రుసుము పెంచింది.

రెండు లక్షల వరకూ....
సహజంగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. తమకిష్టమైన నెంబర్ల కోసం డబ్బులు ఖర్చు చేస్తుంటారు. . కొంత నగదు రవాణా శాఖకు చెల్లించి ఫ్యాన్సీ నెంబరును సొంతం చేసుకుంటారు. అయితే గణనీయంగా పెంచుతూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహనాల చట్టాన్ని సవరిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఫీజును రెండు లక్షల వరకూ పెంచడాన్ని కొందరు తప్పుపడుతు్నారు.


Tags:    

Similar News