Heavy Rain : మరికొద్ది గంటల్లో అక్కడ భారీ వర్షమట

చెన్నైకి ఆగ్నేయంగా అల్పపీడనం కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-12-26 07:31 GMT

చెన్నైకి ఆగ్నేయంగా అల్పపీడనం కేంద్రీకృతం అయిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, కావలి ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారు జాము వరకూ భారీ వర్షం పడింది. ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. రైతులు కూడా ఈ వర్షానికి నష్టపోయినట్లు తెలిసింది. పంటలు వర్షానికి తడిసిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందంటున్నారు.

అక్కడే ఉండటంతో...
ఉదయం నుంచి తిరుపతి జిల్లాలోని కొన్ని భాగాల్లోకి వర్షాలు పడుతున్నాయి. తిరుపతి నగరంలో మరో రెండు గంటల వ్యవధిలో అక్కడక్కడ మోస్తరు వర్షాలుపడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు రానున్న కొద్ది సమయంలో పడే అవకాశముందని తెలిపింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 



 


Tags:    

Similar News