Rain Alert : 22న మరో అల్పపీడనం.. వెదర్ రిపోర్ట్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ కు మరోసారి అల్పపీడనం ప్రమాదం పొంచి ఉంది. దీంతో భారీ వర్షాలు కురియనున్నాయి.

Update: 2024-10-18 01:55 GMT

ఆంధ్రప్రదేశ్ కు మరోసారి అల్పపీడనం ప్రమాదం పొంచి ఉంది. దీంతో భారీ వర్షాలు కురియనున్నాయి. ఈ నెల 22వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని జిల్లాల్లో తేలిక పాటి, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ఈరోజు మాత్రం కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

భారీ వర్షాలు ఇక్కడ...
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిసింది. భారీ వర్షాలు మాత్రం నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Tags:    

Similar News