Andhra Pradesh : 9వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. కీలక బిల్లులకు ఆమోదం పొందనుంది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం పలు పాలసీలపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. డ్రోన్, క్రీడలు, టూరిజం, ఎలక్ట్రానిక్, డేటా సెంటర్ పాలసీలపై సంబంధిత శాఖల మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కందుల దుర్గేష్, నారా లోకేశ్ లు ప్రకటన చేయనున్నారు.
కీలక బిల్లులకు...
ఈరోజు శాసనసభలో ఆరు బిల్లులను ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదం పొందనుంది. టెండర్లను న్యాయ పరిశీలనకు పంపే బిల్లు రద్దు, ఆలయాల ధర్మకర్తల మండళ్లలో సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తూ దేవాదాయశాఖ సవరణ చట్టం, సహజ వాయువుపై వ్యాట్ ను తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లపై చర్చించి అసెంబ్లీ ఆమోదించనుంది. రుషికొండలో టూరిజం భవనాలతో పాటు వరద సహాయక చర్యలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నా