Goutham Adani : గౌతమ్ అదానీ లంచం కేసు.. ఆంధ్రప్రదేశ్ కు లింకు?
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ పై న్యూయార్క్ లో కేసు నమోదయింది. లంచాలు ఇచ్చారన్న అభియోగాలపై కేసు నమోదు చేశారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ పై న్యూయార్క్ లో కేసు నమోదయింది. లంచాలు ఇచ్చారన్న అభియోగాలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే గౌతమ్ అదానీ కేసు ఆంధ్రప్రదేశ్ తో సంబంధాలున్నట్లు సమాచారం. ఆయన 2021 సంవత్సరంలో ఏపీకి చెందిన అధికారులకు లంచం ఇచ్చారని ఆయనపై అభియోగాలున్నాయి. ప్రభుత్వ అధికారులకు అదానీల నుంచి భారీ ముడుపులు అందాయని పేర్కొంది. సీకీ ఒప్పందంలో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వినిపించాయి. ఏపీలో విదేశీ అధికారులతో గౌతమ్ అదానీ భేటీ జరిగిందని తేల్చారు. 2021 ఆగస్టు 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20న అదాని భేటీ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇండియన్ ప్రభుత్వ అధికారులకు రూ.2,029 కోట్ల లంచం ఇవ్వచూపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఒప్పందాల కోసం...
AP డిస్కమ్‌లు అదానీ పవర్ కంపెనీతో నేరుగా ఎలాంటి ఒప్పందంపై సంతకం చేయలేదు. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదానీ SECI నుండి power కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో ఏపీ ఒప్పందాల కోసం రూ.1750 కోట్ల లంచం ఇవ్వచూపినట్లుగా కూడా అభియోగాలున్నాయి. దీంతో ఏపీలోని డిస్కమ్ లో భారీగా నష్టపోయాయి. విద్యుత్ ఒప్పందాలు స్పీడ్ గా అమలు చేసేందుకు అదానీ భారీగా ముడుపులు అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇండియన్ ఎనర్జీ కంపెనీ అనుబంధ సంస్థలకు పాత్ర నిందితులుగా గౌతమ్ అదానీ ఆయన మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురిపై కూడా న్యూయార్క్ ఈస్ట్‌ర్న్ డిస్ట్రిక్ కోర్టులో కేసు నమోదయింది. 2021-2024 మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో అధికారుల పాత్రపై అనుమానాలున్నాయి. అదే సమయంలో ఇండియన్ ఎనర్జీ కార్పొరేషన్, దాని అనుబంధ కంపెనీల పాత్ర సోలార్ ప్రాజెక్టులకు త్వరిత గతిన అనుమతి కోసం భారీ ఎత్తున లంచాలు ఇవ్వచూపారని అభియోగాలున్నాయి. ఈ ఒప్పందాల్లో ఏపీ ప్రభుత్వ అధికారి కీలక పాత్ర పోషించినట్లు అభియోగాలున్నాయి. 2019 మే నుంచి 2024 జూన్ వరకు ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారి కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.
న్యూయార్క్ లో కేసు నమోదు...
అధికారులకు లంచాలు ఇవ్వడమే కాకుండా ఇన్విస్టెర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసు నమోదయింది. భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్లను లంచాలు చెల్లించినట్లు కూడా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తర్వాత అమెరికా, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణకు అదానీ కంపెనీ ప్రయత్నించిందని ఈ అభియోగాల్లో పేర్కొన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీలో అనేక అక్రమ మార్గాల ద్వారా పెట్టుబడిదారులు, రుణదాతల నుంచి మూడు బిలియన్ డాలర్లకు పైగానే రుణాలను, బాండ్లను సేకరించిందని అభియోగాలు నమోదు చేశారు. అమెరికాలో ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని చెబుతారు. చివరకు అమెరికా అదానీ కేసుకు.. ఆంధ్రప్రదేశ్ కు లింకు ఉండటం ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.