వైసీపీకి సూపర్ న్యూస్ చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 133 సీట్లు లభిస్తాయంటూ ఏప్రిల్ 18వ తేదీన ట్వీట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల

Update: 2023-06-04 05:25 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లొచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. వచ్చే ఏడాది సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చని అంచనాలు వేస్తున్నారు. ప్రత్యర్థులను ఈ ఎన్నికల్లో కూడా చిత్తు చేయాలని వైసీపీ భావిస్తోంది. తాము మంచి పాలనను అందిస్తూ ఉన్నామని.. అలాంటప్పుడు ప్రజల మద్దతు తమకే ఉంటుందని భావిస్తూ ఉన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మన భవిష్యత్ పేరుతో పలు కార్యక్రమాలు జరిగాయి. ఇక వైసీపీకి మరింత బూస్ట్ ఇచ్చేలా ఓ ప్రముఖ జోతిష్యుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ ప్రతాప్ ఏపీ రాజకీయాలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మరోసారి అధికారంలోకి రాబోయేది వైఎస్ జగనే అని తేల్చి చెప్పారు. వైఎస్ జగన్ సారథ్యంలో ఏపీలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసినట్లు వివరించారు. పూర్తి కాలం పాటు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉంటారని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. గతంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని రుద్ర కరణ్ ప్రతాప్ అంచనా వేశారు. మే నెలలో బీజేపీకి అన్నీ చేదు అనుభవాలు ఎదురవుతాయని, ఆ పార్టీ ఎదురుదెబ్బలను చవి చూస్తుందంటూ హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 122 నుంచి 133 సీట్లు లభిస్తాయంటూ ఏప్రిల్ 18వ తేదీన ట్వీట్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు ఆ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన అంచనా వేసినట్టే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 135 సీట్లను సాధించింది. ఏపీ పాలిటిక్స్ పరంగా కూడా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారనుంది. వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ, జనసేనలు భావిస్తున్న తరుణంలో ఆయన చెప్పిన జోస్యం హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News