ఏపీలో ఆధార్ అప్‌డేట్ కోసం?

ఏపీ ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులను నిర్వహించనున్నారు

Update: 2023-01-18 05:57 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులను నిర్వహించనున్నారు. సచివాలయాల్లో ఈ ప్రత్యేక ఆధార్ క్యాంప్ లను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోని వారు 80 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు.

ప్రత్యేక క్యాంప్‌లు...
వీరి కోసం ప్రత్యేకంగా క్యాంప్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 19,20,21, 23, 24 తేదీల్లో మొదటి విడతగా ఐదు రోజుల పాటు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తారు. రెండో విడతలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి పది వతేదీ వరకూ క్యాంప్ లను నిర్వహిస్తారు. అప్‌డేట్ చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.


Tags:    

Similar News