తెలుగు విద్యార్థులను తీసుకు వచ్చేందుకు?

మణిపూర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను తీసుకు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

Update: 2023-05-07 13:28 GMT

మణిపూర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను తీసుకు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సురక్షితంగా వారి స్వస్ధలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 157 మంది ఏపీ విద్యార్థులు మణిపూర్ లో చదువు తున్నట్టు గుర్తించారు. మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కళాశాలలో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్ధిని నోడల్‌ పాయింట్‌గా అధికారులు గుర్తించారు. వారిద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్ధుల వివరాలను సేకరిస్తున్నారు. వీరిని ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక విమానంలో
విద్యార్ధులను ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి పౌరవిమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నామని, తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రేపు ఉదయం మణిపూర్‌లోని ఇంపాల్‌లో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ కర్ఫ్యూ సడలించారు. ఈ సమయంలో. వ్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్ధులను తరలించడానికి పౌరవిమానయానశాఖ అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్నిగంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌరవిమానయానశాఖ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News