ఏపీఎస్ ఆర్టీసీ తగ్గింపు చార్జీలు ఎక్కడంటే ...

పర్యావరణమే లక్ష్యంగా సుదూర ప్రయాణాలు చేసే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Update: 2023-08-27 11:47 GMT

ఏపీఎస్ ఆర్టీసీ తగ్గింపు చార్జీలు ఎక్కడంటే ...

పర్యావరణమే లక్ష్యంగా సుదూర ప్రయాణాలు చేసే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుండడంతో ఈ నెల 26 నుంచి ఎలక్ట్రిక్‌ బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఆర్టీసీ అధికారి ఎం భాస్కర్‌ వెల్లడించారు. కడప, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య తదితర జిల్లాకు వెళ్లే బస్సుల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు తెలిపారు. సవరించిన ఛార్జీల ప్రకారం తిరుపతి-నెల్లూరు బస్సు ఛార్జీ ఇప్పటివరకు రూ.350గా ఉండగా, ఈ ఛార్జీని రూ.300కు తగ్గించారు.

తిరుపతి నుంచి కడపకు రూ.340 ఛార్జీ ఉండగా, రూ.290కు తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తిరుపతి- మదనపల్లెకు రూ.300 ఛార్జీ ఉండగా దాన్ని రూ. 260కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. మొదటి విడత కింద ఏపీఎస్‌ఆర్టీసీ తిరుపతికి 100 ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించగా, ఇందులో 50 బస్సులు తిరుమల-తిరుపతి మధ్య తిరుగుతున్నాయి.

తిరుమల-రేణిగుంట మధ్య14 బస్సులు, తిరుపతి-నెల్లూరు మధ్య 12 బస్సులు తిప్పుతున్నారు. తిరుపతి-కడప రూట్లో 12 బస్సులు, తిరుపతి-మదనపల్లి రూట్‌లో మరో 12 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్ ఛార్జీలను తగ్గించడంపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఈ తగ్గింపు ధరలను రాష్ట్రం అంతటా విద్యుత్ బస్సులకు వర్తింప చేయాలని వారు కోరుతున్నారు.

తెలంగాణ- ఏపీ మధ్య స్పెషల్ రైళ్లు.. సమయాలు …




దక్షిణ మధ్య రైల్వే కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య పలు స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. రైలు నెంబరు 07439 కాకినాడ టౌన్-లింగంపల్లి ట్రైన్ ను సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఈ ట్రైన్ ప్రతీ సోమ, బుధ, శుక్రవారాల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో కాకినాడు నుంచి 20.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09:15 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

రైలు నెంబరు 07440 లింగంపల్లి-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ ను సెప్టెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు నడపనున్నారు. ఈ ట్రైన్ ను ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 18.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 7:10 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. ఈ ట్రైన్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టెషన్లలో ఆగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. .. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే.

Tags:    

Similar News