బెంగాల్ టైగర్... దొరికేదెలా?

బెంగాల్ టైగర్ ఫారెస్ట్ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. కాకినాడ జిల్లాలో ప్రజలను నిద్రలేకుండా చేస్తుంది.

Update: 2022-06-12 06:21 GMT

బెంగాల్ టైగర్ ఫారెస్ట్ అధికారులను ముప్పుతిప్పలు పెడుతుంది. కాకినాడ జిల్లాలో ప్రజలను నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా వజ్రకరూరు ప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. వజ్రకూటం వద్ద ఒక ఆటోలో వివాహానికి వెళ్లి వస్తున్న వారికి పులి కంటపడటం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించారు.

జనావాసాలకు.....
ఇటీవల కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి అటవీ శాఖ అధికారులను హడలెత్తేలా చేస్తుంది. మూడు వారాలు గడుస్తున్నా అధికారుల ప్రయత్నాలు ఫలించడం లేదు. పులి కోసం బోన్లు ఏర్పాటు చేసినా చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంది. జనావాసాల మీదకు పులి రాకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శంఖవరం - వజ్రకరూరు మార్గంలో పులి సంచరించడంతో ఆ వైపు ప్రజలు వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పులి పత్తిపాడు సమీపంలో సంచరిస్తుందని తెలియడంతో ఆ ప్రాంత వాసులు తమ పశువులను కూడా బయటకు తీసుకెళ్లడం లేదు. కొందరు యువకులు కర్రలతో, కత్తులతో రాత్రులు పహారా కాస్తున్నారు. మొత్తం మీద బెంగాల్ టైగర్ మూడు వారాలుగా అటవీ శాఖ అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తుంది.


Tags:    

Similar News