జనసేనతో కలిసే పోరు సాగిస్తాం

మే 5 నుంచి ప్రజా చార్జ్ షీట్ల కార్యక్రమం ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. గుంటూరులో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.

Update: 2023-04-24 12:21 GMT

మే 5 నుంచి ప్రజా చార్జ్ షీట్ల కార్యక్రమం ప్రారంభించాలని బీజేపీ నిర్ణయించింది. గుంటూరులో బిజెపి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని ద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వ స్టిక్కర్లు వేస్తున్నారని సునీల్ దేవధర్ ఆరోపించారు. ఆయుస్మాన్ భవ కార్యక్రమానికి ఆరోగ్యశ్రీ స్టిక్కర్ వేశారని, ఉచిత బియ్యం కేంద్రం ఇస్తుంటే వాటిని ప్రజలకు పంచటం లేదన్నారు. కేంద్రం లక్షలాది ఇళ్లుమంజూరు చేస్తే వాటికి జగనన్న ఇళ్లు అనే పేరు పెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాలమయంగా మారిందని, వైసీపీ నేతలు సహజ వనరులను దోచుకోవటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు.

ఈ ప్రభుత్వంపై మే 5 నుంచి ....
జనసేనతో కలసి ఉద్యమించాలని బీజేపీ నేత సునీల్ దేవధర్ పిలుపు నిచ్చారు. జనసేన బీజేపీ మిత్రపక్షమని దానిని కలుపుకుని కార్యక్రమాలను రూపొందించు కోవాలని అన్నారు. ఏడాది కంటే తక్కువ సమయం ఎన్నికలకు ఉందని గుర్తు చేశారు. గత ఎన్నికల ఫలితాలు చూసి నిరుత్సాహానికి గురికావద్దని, ఏపీలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి మర్చిపోవాలని, వచ్చే వాళ్లను ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. .జిన్నా టవర్ పేరు మార్పు బీజేపీ అజెండాలో ఉందన్న సునీల్ దేవధర్ జిన్నా పట్ల జగన్ కు ఎందుకింత ప్రేమ అని ప్రశ్నించారు. జనసేన మన మిత్రపక్షమని, జనసేన నాయకులతో కలిసి ప్రజా పోరు చేయాలన్నారు.


Tags:    

Similar News