నేడు వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.;

Update: 2024-11-27 02:46 GMT
ramgopal varma, controversial director, notices, prakasam district police
  • whatsapp icon

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నా ఆయన గత రెండు రోజుల నుంచి తప్పించుకుతిరుగుతున్నారు. తనకు బెయిల్ పిటీషన్ ఇవ్వాలంటూ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారించాల్సి ఉండగా ఈరోజుకు వాయిదా వేసింది.

మూడు జిల్లాల్లో కేసులు...
నేడు రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపి ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అన్నది నిర్ణయించనుంది. వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పటికే తమిళనాడు, హైదరాబాద్ లలో గాలింపు చర్యలు చేపట్టారు. వర్మ సోషల్ మీడియాలో పోస్టులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై అనుచిత పోస్టులు పెట్టినందుకు ప్రకాశం, విశాఖ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.


Tags:    

Similar News