Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నేడు విడుదల చేసింది.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నేడు విడుదల చేసింది. ఉదయం 11.40 గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. అనంతరం సచివాలయంలో వివిధ శాఖలపై ఆయన అధికారులు, మంత్రులతో సమీక్షించనున్నారు. ఉదయం 12.30 గంటలకు మారిటైం పాలసీపై చంద్రబాబు సమీక్షిస్తారు.
ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీపై...
సాయంత్రం నాలుగు గంటలకు ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో పాటు వివిధ రూపాల్లో అందించనున్న ప్రయోజనాలపై చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఛార్జింగ్ పాయింట్లపై కూడా చంద్రబాబు చర్చించే అవకాశముంది.