ఏపీలో సర్జికల్ స్ట్రయిక్ చేసైనా పవర్ లోకి వస్తాం
ఆంధ్రప్రదేశ్ లో సర్జికల్ స్ట్రయిక్స్ చేసి అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో సర్జికల్ స్ట్రయిక్స్ చేసి అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో ఏపీలో బీజేపీ, జనసేన కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలలో అభివృద్ధి అనేది అస్సలు లేదన్నారు. అది జీ కేటగిరిలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయలు నిధులును రోడ్ల నిర్మాణం కోసం వెచ్చిస్తుంటే రాష్ట్రం కనీసం ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. నడికుడి - శ్రీకాళహస్తి రైలు మార్గం కోసం కేంద్రం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని సోము వీర్రాజు ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం పూర్తి వైఫల్యం....
రాజధాని విషయంలోనూ ఏపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. అవినీతి, కుటుంబ పాలన కారణంగా పరిపాలన అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు కలసి మైఫియాగా తయారయి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి అత్యధిక ఆదాయ వనరులన్నా పాలన చేతకాక అప్పులు చేస్తుందని ఆయన మండిపడ్డారు. కాకినాడ నుంచి జరుగుతున్న రేషన్ బియ్యం మాఫియా దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు. కుటుంబ పార్టీలను ప్రజలు తిరస్కరించాలని సోము వీర్రాజు పిలుపు నిచ్చారు.