Breaking : జనసేనకు షాకిచ్చిన తూర్పుగోదావరి జిల్లా నేతలు..కీలక నేతలు జంప్
రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు ఆ పార్టీని వీడారు
రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు ఆ పార్టీని వీడారు. ఆయన తిరిగి వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో బొంతు రాజేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీలో చేరడంతో ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తాను రాజోలు నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేయాలని భావించారు.
బొంతు రాజేశ్వరరావుతో పాటు...
కానీ బొంతు రాజేశ్వరరావును పక్కన పెట్టి ప్రసాదరావుకు టిక్కెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేశారు. బొంతు రాజేశ్వరరావుతో పాటు రాజోలుకు చెందిన పలువురు నేతలు వైసీపీలో చేరారు. వీరితో పాటు శేషుకుమారి కూడా పార్టీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నేతలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాజోలు నియోజకవర్గంలో బొంతు రాజేశ్వరరావు పార్టీని వీడటం ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది.