Breaking : ఏపీ ప్రభుత్వ పథకాలకు ఎన్నికల సంఘం బ్రేక్
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిధుల విడుదలకు నో చెప్పింది. తుఫాను కారణంగా రైతులకు ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు, విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం ఇచ్చే నిధులను కూడా విడుదల చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
విద్యాదీవెన నిధుల విడుదలకు...
విద్యాదీవెన విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. 610 కోట్ల రూపాయల విద్యా దీవెన నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరింది. అయితే ఎలాంటి పథకాలు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఎలాంటి పథకాలను అమలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.