మార్చి 3న ఛలో ఆంధ్రా యూనివర్శిటీ

ఆంధ్రా యూనివర్శిటీ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం..

Update: 2022-02-28 06:56 GMT

విశాఖపట్నం : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ ఆంధ్రా యూనివర్శిటీ పరిరక్షణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మార్చి 3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హర్షకుమార్.. ఆంధ్రా యూనివర్శిటీ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికే వర్శిటీలో పెద్దపీట వేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. రిటైర్ అయిన ఉద్యోగిని.. తిరిగి రిజిస్ట్రార్ గా నియమించిన చరిత్ర ఏ యూనివర్శిటీలోనూ లేదన్న హర్షకుమార్.. యూనివర్శిటీలో జరుగుతోన్న అక్రమాలపై ప్రశ్నిస్తామన్నారు. కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు.


Tags:    

Similar News