చంద్రబాబు నాయుడు.. బైపీసీ.. ఇంజినీరింగ్.. వీడియో వైరల్

పలు వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది.

Update: 2023-08-16 02:49 GMT

ఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ఇండియా విజన్ 2047 ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు చాలా విషయాలను ప్రస్తావించారు. తన విజన్‌ గురించి వివరించే సమయంలో.. పిల్లలు ఇంజినీరింగ్ చేయాలనుకోవటం తల్లిదండ్రుల 20 ఏళ్ల కల.. ఆ కలే విజన్ అంటూ చంద్రబాబు వివరించారు. ఆ విజన్ నెరవేర్చుకునేందుకు పిల్లలను చిన్నప్పటి నుంచే ఏ స్కూల్‌లో వేయాలి.. ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలి.. ఇంటర్మీయట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అని వివరిస్తూ చెప్పుకొచ్చారు చంద్రబాబు బాబు నాయుడు. ఆయన చెప్పిన చాలా విషయాలను ప్రస్తుతం పట్టించుకోకుండా.. బైపీసీ.. ఇంజినీరింగ్.. అంటూ చెప్పిన వ్యాఖ్యలను వైరల్ చేయడం మొదలుపెట్టారు.




టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ సభలో విజన్ డాక్యుమెంట్-2047ని ఆవిష్కరించారు. ఇండియా ఇండియన్స్ తెలుగూస్ పేరిట రూపొందించిన ఈ డాక్యుమెంట్ లో భారత్ నెంబర్ అయ్యేందుకు ఏం చేయాలో సూచించారు. ఇందు కోసం చంద్రబాబు నాయకత్వంలోని జీఎఫ్ఎస్టీ బృందం పలు వ్యూహాలను ఈ విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచింది.


Tags:    

Similar News