Chandrababu : అమరావతి నిర్మాణంపై అసలు విషయం చెప్పేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు.

Update: 2024-07-03 12:09 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో కొత్త ప్రణాళికలు ఏవీ లేవని, పాత వాటినే కొనసాగిస్తూ నిర్మాణం చేస్తాని తెలిపారు. ప్రపంచంలోనే అమరావతి అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అని ఆయన తెలిపారు. ఇది కొందరి రాజధాని అని చేస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాజధాని అమరావతి అందరిదీ అని ఆయన పేర్కొన్నారు. అమరావతి నగరానికి మంచి భవిష్యత్ ఉందని ఆయన తెలిపారు.

అందుకే ఎవరూ కదల్చలేక...
అమరావతిలో ఎంతో మహిమ ఉందని, అందుకే దానిని ఎవరూ కదల్చలేకపోయారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రాజధానికి వచ్చేందుకు మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని చంద్రబాబు అన్నారు. విజయవాడ - గుంటూరు మధ్య రాజధాని ఉండాలని అప్పట్లో శివరామకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనకు హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం ఉందని, తొమ్మిదేళ్లలోనే సైబరాబాద్ ప్రాంతాన్ని డెవలెప్ చేశామని, కృష్ణానది నుంచి నీళ్లను తెచ్చి నాడు సైబరాబాద్ కు ఇచ్చామన్నారు. అమరావతి కూడా భవిష్యత్ లో దేశంలోనే మంచి రాజధానిగా మిగిలిపోయేలా నిర్మిస్తామని తెలిపారు.
నవ నగరాలను...
29 వేల మంది రైతులు 34,400 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని, వారిక ప్రతి ఏటా పరిహారం అందిస్తామని, పదేళ్ల పాటు ఈపరిహారం కొనసాగుతుందని ఆయన తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేశారన్న చంద్రబాబు ఐదేళ్లలో పురోగతిని సాధించాల్సింది పోయి మూడు రాజధానులంటూ మూర్ఖంగా ముందుకు వెళ్లి బొక్కా బోర్లా పడ్డారని చంద్రబాబు గుర్తుచేశారు. అమరావతిలో మొత్తం తొమ్మిది నగరాలను నిర్మించాలన్న ఆలోచనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని తెిపారు. ఫైనాన్షియల్, టూరిజం, ఎలక్ట్రానిక్, హెల్త్ సిటీలతో పాటు మీడియా సిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమరావతికి పోయిన బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తెప్పిస్తామని తెలిపారు.
Tags:    

Similar News