Breaking : జగన్ కు అవకాశమిచ్చిన చంద్రబాబు.. ఎంత మార్పు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని పార్టీ నేతలను కోరారు;
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని పార్టీ నేతలను కోరారు. ఆయన వాహనాన్ని గతంలో మాదిరిగా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కావడంతో ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించడంతో ఒక క్లారిటీ ఇచ్చారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆయనకు ఇచ్చే గౌరవం ఇవ్వాలని చంద్రబాబు నేతలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రతిపక్ష హోదా లేకపోయినా...
కేవలం పదకొండు స్థానాలు మాత్రమే రావడంతో జగన్ సాధారణ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయనను ఇంగ్లీష్ అక్షరాల క్రమంలో ప్రమాణ స్వీకారం చేయిస్తారని భావించారు. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ కు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జగన్ ను సాధారణ ఎమ్మెల్యేగా చూడవద్దని చంద్రబాబు నుంచి ఆదేశాలు రావడంతో ఆయన వాహనం నేరుగా అసెంబ్లీ హాలు వద్దకు పోలీసులు అనుమతించనున్నారు.