Chandrababu : కుప్పం ప్రజలుకు అదిరేటి వరాలు ప్రకటించిన చంద్రబాబు

తన రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

Update: 2024-06-25 12:51 GMT

తన రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్తిగా వెనకబడిన ప్రాంతాన్ని తాను ఎంచుకున్నానని ఆయన తెలిపారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. గత నలబై ఏళ్ల నుంచి కుప్పం ప్రజలు తనను ఆదరిస్తున్నారని అన్నారు. వారి రుణాన్ని తీర్చుకోలేని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన మాట ిఇచ్చారు. మరో జన్మ అంటూ ఉంటే కుప్పంలోనే పుడతానని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. తాను ఇక్కడకు వచ్చినా, రాకపోయినా తనను ఎనిమిదేళ్లుగా ఆదరిస్తున్నారని, అందుకే తాను ఎప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను తిరగరాయబోతున్నామని తెలిపారు. అహంకారానికి పోతే ఎవరికైనా వైసీపీకి పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారన్నారు.

సామాజిక న్యాయానికి...
మంత్రివర్గంలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామన్న చంద్రబాబు ఎనిమిది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను, దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారని, చివరకు తనను కూడా కుప్పంలోకి రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇక్కడ ఎవరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. రౌడీయిజం చేసే వారికి అదే చివరి రోజు అని అన్నారు. నేటి నుంచే కుప్పంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రతి గ్రామాానికి తాగునీరు, వీధి దీపాలు డ్రైనేజీని అందిస్తామని తెలిపారు. త్వరలోనే కుప్పానికి విమానాశ్రయం వస్తుందని, ఇక్కడ పంటే పంటలను నేరుగా ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు పంపే ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News