Chandrababu : కలెక్టర్లకు క్లాస్ పీకిన చంద్రబాబు
ప్రజల్లో అసంతృప్తి లేకుండా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు;
ప్రజల్లో అసంతృప్తి లేకుండా ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కారం కావాలన్నారు. అనేక దరఖాస్తులు తమకు అందుతున్నాయని, జటిలమైన సమస్యలు తప్ప మిగిలిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే ప్రజలు కూడా హ్యాపీ ఫీలవుతారన్నారు. ప్రభుత్వ విజన్ తెలిపేందుకే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని చెప్పారు. తూతూ మంత్రంతా రెవెన్యూ సదస్సులు జరిపితే ఏమాత్రం లాభం ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
విశాఖకు గూగుల్...
అయితే ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తుంటే సానుకూల ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. ఇటీవల మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించినప్పుడు గూగుల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఇక్కడకు క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని కోరారని, వారు వచ్చారని, ఇటీవలే గూగుల్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరిందని చంద్రబాబు తెలిపారు. విశాఖను సందర్శించిన తర్వాత గూగుల్ బృందం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. విశాఖలో గూగుల్ రావడంతో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. స్మార్ట్ వర్క్ తో పూర్తి చేస్తే ఏ పనని అయినా సాధించగలమని అన్నారు. ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు తెలిపారు.