నాగబాబు పర్యటనలో జై వర్మ నినాదాలు
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు పిఠాపురం నియోజకవర్గంలో నిరసన సెగ తగులుతుం;

జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు పిఠాపురం నియోజకవర్గంలో నిరసన సెగ తగులుతుంది. నిన్నటి నుంచి నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తున్నారు. అయితే ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన ప్రసంగం కొంత వర్మ అనుచరులకు ఇబ్బందికంగా మారింది.
పిఠాపురం నియోజకవర్గంలో...
దీంతో నాగబాబు పర్యటనలో పాల్గొన్న టీడీపీ నేతలు జై టీడీపీ, జై వర్మ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీనికి ప్రతిగా జనసేన కార్యకర్తలు కూడా ప్రతిగా నినాదాలు చేస్తుండటంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు రెండు వర్గాలను శాంతింప చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరికి వారు తమ నేతలకు, తమ పార్టీలకు జై కొడుతుండటంతో గందరగోళంగా మారింది.