Chandrababu : జమిలీ ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారంటే?
మంచి పనులు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరిస్తారని హర్యానా ఎన్నికల ఫలితాలు రుజువు వచేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
మంచి పనులు చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరిస్తారని హర్యానా ఎన్నికల ఫలితాలు రుజువు వచేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ హర్యానాలో విజయం శుభశూచకమన్న ఆయన ప్రధాని మోదీపై నమ్మకం ఉంచిన ప్రజలు సుస్థిరత, అభివృద్ధికే ఓటు వేశారన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోనూ బీజేపీ ఓట్ల శాతం బాగా పెరిగిందన్నారు. రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం తథ్యమని తెలిపారు.
అభివృద్ధికి ఆటంకం...
ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధికి ఆటంకమని చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకే జమిలీ ఎన్నికలను నిర్వహించడం మేలని అన్నారు. ఒఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకే సారి ఎన్నికలు జరిగితే తర్వాత అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని అన్నారు. యువత మన దేశానికి గొప్ప వరమని ఆయన అన్నారు.