Ys Jagan : తుఫానుపై జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు

Update: 2023-12-02 13:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఈనెల 4న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన సూచనతో జగన్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. తుఫాన్‌ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

బాధితులకు అండగా...
ప్రభుత్వ ఉద్యోగులు వరద బాధితులకు సాయంగా నిలబడాలని ఆయన కోరారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని తెలిపారు. ప్రధానంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పడంతో ఆ జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యగా బాధితులను తరలించాలని కోరారు. ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.


Tags:    

Similar News