నేడు పూర్ణాహుతిలో పాల్గొననున్న జగన్
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్ నేడు యాగం చివరి రోజు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, సకల జనుల సంతోషానికి రాజశ్యామల దేవీ యజ్ఞం ప్రభుత్వం నిర్వహించిందని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నేడు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. నూతన పట్టు వస్త్రాలను ముఖ్యమంత్రి జగన్ సమర్పిస్తారని కూడా ఆయన తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గత ఐదు రోజులుగా యాగం జరుగుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.
దుర్గమ్మ గుడి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్...
ఈరోజు ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయానికి చెందిన రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. దానికి ఆమోద ముద్ర వేసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని కాంక్షించి, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా లోకకళ్యాణ హితార్థం చేస్తున్న అష్టోత్తర శత కుండాత్మక) చండీ, రుద్ర, రాజశ్యామల, ఉదయం 8.55 గం.లకు ముఖ్యమంత్రి యజ్ఞ మండపం వద్దకు చేరుకుంటారని, అనంతరం 9.10 నిమిషాలకు పాంచరాత్ర యాగశాలలో, 9.20కి వైదిక స్మార్త యాగశాలలో విశేష విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.