నేడు ఏపీ, తెలంగాణ అధికారుల సమావేశం
ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం జరగనుంది
ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ విభజన అంశాలపై అధికారుల కమిటీ చర్చించనుంది. మంగళగిరిలోని ఏపీఎస్సీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై అధికారులు చర్చించనున్నారు. ఈ సమావేశంలో వాటి పరిష్కారానికి అవసరమైన విషయాలపై చర్చించనున్నారు.
విభజన అంశాలపై...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చీఫ్ సెక్రటరీల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటయింది. కొంతకాలం క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ హైదరాబాద్ లో విభజన అంశాలపై చర్చించేందుకు సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ముందుగా కొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులతో కూడిన కమిటీ సమావేశమవుతుందని ప్రకటించారు. నేడు ఈ సమావేశం జరగనుంది.