తిరుమలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వారాంతపు సెలవులు పూర్తి కావడంతో నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

Update: 2022-08-29 02:53 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వారాంతపు సెలవులు పూర్తి కావడంతో నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి కేవలం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశముంది.

హుండీ ఆదాయం...
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 74,297 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. 27,317 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News