తిరుమలలో భక్తుల రద్దీ.. ఖాళీగా క్యూ కాంప్లెక్స్

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. ఈరోజు రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు

Update: 2022-09-01 02:23 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కేవలం రెండు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి ఐదు గంటల్లో శ్రీవారి దర్శనం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 66,086 మంది భక్తులు దర్శించుకున్నారు. వినాయకచవితి కావడంతో పెద్దగా భక్తులు తిరుమలకు రాలేదు. 27,305 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.72 కోట్ల రూపాయలుగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News