Tirumala : తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. చాలా రోజుల తర్వాత?

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. సాధారణ స్థితికి చేరకుంది

Update: 2024-06-26 02:42 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. సాధారణ స్థితికి చేరకుంది. దాదాపు ఇరవై రోజులకు పైగానే తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి భక్తులు నిరీక్షించాల్సి వస్తుంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ లలో భక్తులు వేచి ఉండటం కనిపించింది. అయితే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గినట్లే కనిపిస్తుంది. సాధారణ స్థితికి చేరుకుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

దర్శనానికి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,824 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,462 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.01 కోట్ల రూపాయల వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News