తిరుమలలో ఈరోజు రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుంది

Update: 2023-10-04 03:40 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. పెరటాసి మాసం కావడంతో ఎక్కువ మంది భక్తులు తమిళనాడు నుంచి వస్తున్నారు. సెలవులు ముగియడంతో ఇక రష్ తగ్గినట్లేనని అధికారులు భావిస్తున్న తరుణంలో తమిళనాడు నుంచి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటుండటంతో క్యూ లైన్లీ కిటకిటలాడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. వారికి అన్న ప్రసాదంతో పాటు తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

పదిహేను గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 79.365 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,952 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పద్దెనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News