వేసవి రద్దీ మొదలయింది
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది. పరీక్షలు పూర్తి కావడంతో ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది. పరీక్షలు పూర్తి కావడంతో ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూడకుండా నేరుగా స్వామి వారి దర్శనం కోసం వెళుతున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు ప్రవేశించే భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనానికి సమయం పద్దెనిమిది గంటలు పడుతుందని అధికారులు వెల్లడించారు.
నేడు సమయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,314 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 24,715 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారని అధికారులు చెప్పారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.48 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.