Andhra Pradesh : ఏపీలో ఇప్పటి వరకూ ఉచిత గ్యాస్ అందుకుంది ఎంతమందో తెలుసా?

మహిళలకు ఉచిత గ్యాస్ పథకాన్ని దీపావళి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పటి వరకూ అనేక మంది ఈ పథకాన్ని అందుకున్నారు.

Update: 2024-11-18 12:11 GMT

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత గ్యాస్ పథకాన్ని దీపావళి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఈ పథకం కింద అర్హులైన మహిళలకు అందచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక మంది మహిళలు తమ తమ ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్ ను బుక్ చేసుకుని తొలి విడత సిలిండర్ ను పొందారు.

నలభై లక్షలమంది...
ఇప్పటి వరకూ 40 లక్షల మంది మహిళలు ఉచిత గ్యాస్ ను అందుకున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నలభై లక్షలమంది మహిళలకు ఇప్పటి వరకూ ఉచిత గ్యాస్ సిలిండర్ ను అందించినట్లు ఆయన తెలిపారు. ఏడాదిలో మూడు విడతలుగా ఈ గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరగనుందని ఆయన తెలిపారు. తొలి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని పెద్దయెత్తున మహిళలు వినియోగించుకున్నారు. వెంటనే వారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు చేసిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.


Tags:    

Similar News