Tirumala : తిరుమలలో స్వల్పంగానే రద్దీ... తక్కువ సమయంలోనే దర్శనం

తిరుమలలో నేడు భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. పెద్దగా వేచి కుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు

Update: 2024-09-26 02:24 GMT

tirumala darshan

తిరుమలలో నేడు భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. పెద్దగా వేచి కుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. గురువారం కావడంతో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. రేపటి నుంచి తిరిగి భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ తిరుమలలో అధికంగా ఉంటుంది. ఇక దసరా సెలవులు, బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో ఇక తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈరోజు పెద్దగా వసతి గృహాలకు కూడా వేచి ఉండకుండానే గదులు దొరుకుతున్నాయి. అంతే కాదు స్వామి వారి అన్న ప్రసాదానికి కూడా పెద్దగా రష్ లేకపోవడంతో భక్తులు నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నదాన నిలయంలోకి వెళుతున్నారని అధికారులు తెలిపారు.

మూడు రోజుల నుంచి...
గత మూడు రోజుల నుంచి తిరుమలలో పెద్దగా రద్దీ లేదు. భారీ వర్షాలంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో భక్తుల రద్దీ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఆరు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లున్న భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 77,939 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,668 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News