తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ
తిరుమలలో 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలకు పైగానే సమయం పడుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. గత పదిహేను రోజుల్లో తిరుమల భక్తులతో కిటకిటలాడిపోతుంది. తిరుమలలో కాటేజీలన్నీ దాదాపు నిండిపోయి భక్తులు తమకు ఆరు బయటే ఉంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా వస్తుండటం, పరీక్ష ఫలితాలు రావడంతో ఒక్కసారిగా తిరుమలలో రద్దీ పెరిగిందంటున్నారు. వేచి ఉన్న భక్తులకు అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
దర్శించుకునే సమయం....
నిన్న తిరుమలలో శ్రీవారిని 76,597 మంది భక్తుల దర్వించుకున్నారు. 37,759 మంది శ్రీవారికి తలనీలాలను సమర్పించుకున్నారు. హండీ ఆదాయం నిన్న 4.47 కోట్లుగా ఉంది. గత నాలుగు రోజలుగా శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు కోట్లకు తగ్గడం లేదు. ఈరోజు తిరుమలలో 28 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.