నేరుగా శ్రీవారి దర్శనం
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తుంది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తుంది. సర్వదర్శనం క్యూలైన్ లో భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
14 గంటలు వారికి...
సర్వదర్శనం భక్తులు ఇప్పుడు క్యూ లైన్‌లోకి వెళితే శ్రీవారి దర్శనం పథ్నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 70,605 మంది దర్శించుకున్నారు. 24,947 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.79 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.