ఏపీ వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్ ఆదేశాలు.. ఇకపై వాటిని ధరించరాదు

మహిళా విద్యార్థులు ఇకపై చీరలు లేదంటే, చుడీదార్లతో మాత్రమే కళాశాలలకు రావాలని..;

Update: 2022-12-02 10:59 GMT

dress code for ap students

ఏపీలో వైద్య విద్యార్థులకు రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) డ్రెస్ కోడ్ ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే ఈ ఆదేశాలను జారీ చేయగా.. ఎవరూ పాటించకపోవడంతో మరోమారు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదు. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. మహిళా విద్యార్థులు ఇకపై చీరలు లేదంటీ, చుడీదార్లతో మాత్రమే కళాశాలలకు రావాలని డీఎంఈ ఆదేశాల్లో పేర్కొంది.

ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్ తో రావాలని తెలిపింది. మహిళలు జుట్టును వదులుగా వదిలేయకుండా జడ వేసుకోవాలని, అలాగే స్టెతస్కోప్, యాప్రాన్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తిలోదకాలివ్వడంతో గుర్తించిన అధికారులు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News