Cold Winds : అవసరమైతే తప్ప ఉదయం బయటకు రాకండి.. వాతావరణ శాఖ అలెర్ట్

తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తుంది. మరో రెండు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు;

Update: 2025-01-05 05:55 GMT

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Nowఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి వణికిస్తుంది. మరో రెండు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐదు రోజుల పాటు చలితీవ్రత కొనసాగుతుందని కూడా అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. అవసరమైతే తప్ప ఉదయం వేళ బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. కురుస్తున్న మంచు, చలిగాలుల తీవ్రతతో ఆరోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, అందుకే ప్రజలు వీలయినంత మేరకు ఇళ్లకే పరిమితమయితే మంచిదన్న సూచనలను వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


ఎల్లో అలెర్ట్...

ముఖ్యంగా చిన్నారులు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అన్నిజాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మంకీ క్యాప్ లు, జెర్కిన్ లు, స్వెట్టర్లు ధరించిన తర్వాత మాత్రమే బయటకు రావాలని చెబుతున్నారు. ఈ చలిగాలుల తీవ్రతకు ఎక్కువ మంది జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి వ్యాధులతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. న్యుమోనియా సంబంధిత వ్యాధులున్న వారు, అస్మా రోగులు అస్సలు బయటకు రాకపోవడమే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఉదయం పది గంటల వరకూ ఎండ రాకపోవడంతో పాటు చలిగాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్యకరమైన ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈరోజు జి.మాడుగులలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లి, డుంబ్రిగూడలో 7, పాడేరులో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలైనా మంచు కురుస్తూనే ఉంది. దీంతో చలిమంటలతో జనం ఉపశమనం పొందుతున్నారు. మరో 5 రోజుల పాటు తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్ ఏజెన్సీలోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు చలిమంటలతో దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. పొలం పనులకు వెళ్లే వారు కూడా మధ్యాహ్నం నుంచి బయలుదేరి వెళుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


Tags:    

Similar News