Nara Lokesh : పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం.. విద్యార్థులకు లోకేశ్ గుడ్ న్యూస్
గత వైసీపీ ప్రభుత్వం బకాయీ పెట్టిన బిల్లులన్నీ చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు;

గత వైసీపీ ప్రభుత్వం బకాయీ పెట్టిన బిల్లులన్నీ చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ బిల్లులన్నీ ఖచ్చితంగా చెల్లిస్తామని తలోకేశ్ శాసనమండలిలో సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ 4,200 కోట్ల రూపాయల నిధులను బకాయీ పెట్టిందని లోకేశ్ గుర్తు చేశారు.
పది నెలలే అయింది...
గత ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి పదహారు నెలల సమయం తీసుకుందని కూడా నారా లోకేశ్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి పది నెలలు మాత్రమే అయిందని, అన్ని పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని శాసన మండలి సాక్షిగా లోకేశ్ హామీ ఇచ్చారు. సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోతే తాము చెప్పేది ఎలా అర్థమవుతుందని లోకేశ్ ప్రశ్నించారు.