Elections : నేడే నోటిఫికేషన్.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ

నేడు నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

Update: 2024-04-18 01:37 GMT

నేడు నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మిది గంటటలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. వెలువడిన తర్వాత పదకొండు గంటల నుంచి నామినేషన్లన స్వీకరణ ప్రారంభమవుతుంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నిక జరగనుంది.

నాలుగోదశలో...
నాలుగోదశ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరించ నున్నారు. వీటికి 25వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో నామినేషన్ల ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ప్రారంభ కానుంది.
నేటి నుంచి బంద్...
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వే లు నిలుపుదల చేయాల్సి ఉంది. ఎలాంటి సర్వేలు నేటి నుంచి వెల్లడించడానికి వీలులేదు. జూన్‌ 1న మాత్రం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముహూర్తాలు చూసుకుని నామినేషన్లను దాఖలు చేయడానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది.


Tags:    

Similar News